Bhagavad Gita: Chapter 18, Verse 21

పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ।। 21 ।।

పృథక్త్వేన — వేర్వేరయిన (ఒకదానితో ఒకటి సంబంధము లేనట్టు); తు — కానీ; యత్ — ఏదయితే; జ్ఞానం — జ్ఞానము; నానా-భావాన్ — ఎన్నో రకములైన; పృథక్-విధాన్ — భిన్నములైన; వేత్తి — పరిగణించి; సర్వేషు — అన్నింటిలో; భూతేషు — భూతములు; తత్ — అది; జ్ఞానం — జ్ఞానము; విద్ధి — తెలుసుకొనుము; రాజసం — రాజసికమైన.

Translation

BG 18.21: ఏ జ్ఞానము చేతనయితే, భిన్నభిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.

Commentary

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు రాజసిక జ్ఞానమును వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జగత్తు భగవత్ సంబంధముగా చూడబడదో, కావున ప్రాణులు వేర్వేరుగా తమతమ జాతి, తెగ, కులము, వర్గము, జాతీయత వంటి వాటిచే భిన్నముగా గ్రహించబడుతాయో ఆ జ్ఞానము రజోగుణ జ్ఞానము అని చెప్పబడుతుంది. అటువంటి జ్ఞానము ఒకే మానవ జాతిని ఎన్నో రకాలుగా విభజిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానము అందరినీ దగ్గరికి తెస్తుందో (ఐక్యత) ఆ జ్ఞానము సత్త్వగుణప్రధానమైనది; విభజించే జ్ఞానము, రజోగుణ ప్రధానమయినది.