Bhagavad Gita: Chapter 18, Verse 70

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ।
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ।। 70 ।।

అధ్యేష్యతే — పఠించుట; చ — మరియు; యః — ఎవరైతే; ఇమం — ఇది; ధర్మ్యం — పవిత్రమైన; సంవాదమ్ — సంవాదము; ఆవయోః — మన యొక్క; జ్ఞాన — జ్ఞానము; యజ్ఞేన-తేన — జ్ఞాన యజ్ఞము ద్వారా; అహం — నేను; ఇష్టః — పూజింపబడుట; స్యామ్ — అవుతాను; ఇతి — ఇది; మే — నా యొక్క; మతిః — అభిప్రాయము.

Translation

BG 18.70: మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే (తమ బుద్ధిచే) నన్ను ఆరాధించినట్టు అని నేను ప్రకటిస్తున్నాను; ఇదే నా అభిప్రాయము.

Commentary

అర్జునుడికి తన బుద్ధిని, ఆయనకు సమర్పించమని శ్రీ కృష్ణుడు పదేపదే చెప్పి ఉన్నాడు. (శ్లోకాలు 8.7, 12.8). దీని అర్థం మన బుద్ధిని ఉపయోగించు కోవటం మానేయమని కాదు; మన బుద్ధిని మన చేతనయినంతవరకూ ఆయన సంకల్పమును పూర్తి చేయుటకు ఉపయోగించమని. భగవద్ గీత యొక్క ఉపదేశము ద్వారా ఆయన సంకల్పము ఏమిటో మనకు అర్థం అవుతుంది. కాబట్టి, ఈ పవిత్రమైన సంవాదమును అధ్యయనం చేసేవారు, భగవంతుడిని తమ బుద్ధిచే ఆరాధించినట్టు అవుతుంది.