Bhagavad Gita: Chapter 17, Verse 19

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ।। 19 ।।

మూఢ — అయోమయ భావాలతో ఉన్నవారు; గ్రాహేణ — శ్రమతో కూడి; ఆత్మనః — తమకు తామే; యత్ — ఏదైతే; పీడయా — బాధపెట్టి; క్రియతే — చేయబడునో; తపః — తపస్సు; పరస్య — ఇతరుల; ఉత్సాదన-అర్థం — హాని చేయటానికి; వా — లేదా; తత్ — అది; తామసమ్ — తమో గుణములో; ఉదాహృతమ్ — అని పేర్కొనబడినది.

Translation

BG 17.19: అయోమయ భావాలతో, తమని తామే హింసపెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది.

Commentary

మూఢ-గ్రాహేణాత్ అంటే - అయోమయ ఉద్దేశ్యంతో ఉన్న జనులు అని, తపస్సు అనే పేరు మీద, శాస్త్ర విధివిధానాలను పట్టించుకోకుండా లేదా శరీర పరిమితులను అర్థం చేసుకోకుండా అనవసరముగా తమను తాము హింసించుకుని, లేదా ఇతరులకు హాని చేసేవారు అని అర్థం. ఇటువంటి తపస్సులు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. అవి శారీరక దృక్పథంతో చేయబడినట్టు మరియు మొరటు వ్యక్తిత్వాన్ని చాటుకునేందుకే చేస్తారు.