Bhagavad Gita: Chapter 17, Verse 22

అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే ।
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ।। 22 ।।

అదేశ — తప్పు ప్రదేశంలో; కాలే — తప్పు సమయంలో; యత్ — ఏదైతే; దానం — దానము; అపాత్రేభ్యః — పాత్రత లేని వారికి; చ — మరియు; దీయతే — ఇవ్వబడునో; అసత్-కృతం — మర్యాద లేకుండా; అవజ్ఞాతం — చులకనగా; తత్ — అది; తామసమ్ — తమోగుణములో (అజ్ఞానములో); ఉదాహృతమ్ — పరిగణించబడును.

Translation

BG 17.22: అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హతలేనివారికి (అపాత్రులకు), మర్యాద చూపకుండా, లేదా చులకనగా ఇవ్వబడిన దానము, తామసిక దానముగా పరిగణించబడుతుంది.

Commentary

సరియైన ప్రదేశము, పాత్రత కలిగిన వ్యక్తి, సరైన దృక్పథముతో లేదా సరైన కాలమును చూసుకోకుండా చేసే దానము, తమోగుణ దానము. దానివల్ల ఎటువంటి ప్రయోజనమూ కలుగదు. ఉదాహరణకు, ఒక తాగుబోతుకి డబ్బు ఇస్తే, దానితో అతడు తాగిన మత్తులో ఎవరినైనా హత్య చేస్తే, ఆ హత్య చేసినవాడు కర్మ సిద్ధాంతము అనుసరించి శిక్షింపబడుతాడు, కానీ, ఆ దానము ఇచ్చినవాడు కూడా ఈ పాపంలో భాగస్వామి అవుతాడు. పాత్రత లేనివానికి ఇవ్వబడిన, తామసిక దానమునకు, ఇది ఒక ఉదాహరణ.